దీని భావమేమి చెపుమ
సాహితీమిత్రులారా!
ఈ పొడుపు పద్యం
విప్పగలరేమో చూడండి-
ఇనుజూచిన వికసించును
మునుకొని శీతాంశుజూచి ముకుళించునయా
యనయగ కమలముగాదిది
పనిబడి ముఖ్యముగనుండు పాంథులవద్దన్
సూర్యుణ్ని చూస్తే వికసిస్తుంది
చంద్రుణ్ని చూస్తే ముడుచుకుంటుంది
ఇది కమలమా అంటే కాదు
పనిబడి వెళ్ళేవారివద్ద ముఖ్యంగా
బాటసారులవద్ద ఉంటుంది -
దీని భావమేమిటో విప్పండి-
సమాధానము - గొడుగు(గుడ్డగొడుగు)
No comments:
Post a Comment