అర్ధభ్రమకము
సాహితీమిత్రులారా!
శ్లోకం యొక్క ప్రతిపాదంలోని సగంపాదం
మాత్రమే తిరిగే విధంగా కూర్చబడిన బంధచిత్రం
వేదాంత దేశికులు కూర్చిన పాదుకా సహస్రములోని
ఈ శ్లోకం చూడండి -
లోక తారా కామ చారా
కవిరాజదురావచా
తారాగతే పాదరామ
రాజతే రామపాదుకా
(931)
ఆశ్రితజనులను తరింప చేయునదియు,
కోరదగినయు అయిన గమనముగలదియు,
కవిరాజులయిన వ్యాసవాల్మీకాదులచే కూడ
వర్ణించుటకు శక్యముకానిదియు, గమనము
నందు ఆధికధ్వనిగలదియు, కిరణములను
ప్రసరింపచేయునదియు, అగు రామచంద్రుని
పాదుక ఇలాగా ప్రకాశించుచున్నది- అని భావం.
శ్లోకాన్ని మొదటినుంటి నాలుగువరుసలు
ఈ విధంగా వ్రాసిన తరువాత గమనించగా
దీనిలో ప్రతి పాదంలోని అర్ధభాగం
త్రిప్పి వ్రయబడినట్లు కనిపిస్తుంది గమనించండి.
మొదటి పాదంలోని నాలుగు అక్షరాలుక్రిందికి
మామూలుగా మొదటి వరుస క్రిందికి కనబడతాయి
ఆలాగే చివరి నిలువు వరుస తీసుకుంటే
మొదటి పాదంలోని చివరి నాలుగు అక్షరాలు
క్రిందినుండి పైకి చదువవలసిందిగా మారింది.
ఈ విధంగానే అన్నిపాదాలు గమనించగలరు
అక్షరం ప్రక్కన ఇచ్చిన అంకెల ప్రకారం చదివితే
అది పూర్తిగా గమనించగలరు. శ్లోకాన్ని గమనిస్తూ
బంధం చదవండి-
1లో క9 తా17 రా25 కా32 మ24 చా16 రా8
2క వి10 రా18 జ26 దు31 రా23 వ15 చా7
3తా రా 11 గ 19 తే27 పా 30 ద22 రా14 మ6
4రా జ 12 తే20 రా28 మ29 పా21 దు13 కా5
No comments:
Post a Comment