రెండు కందాలతో 8 రేకుల పద్మం
సాహితీమిత్రులారా!
రాప్తాటి ఓబిరెడ్డిగారి
శ్రీనివాస చిత్రకావ్యంలోని
ఈ అష్టదళ పద్మబంధ కందద్వయం చూడండి-
రెండు కందపద్యాలతో అష్టదళ పద్మబంధం-
రాధానాథా నీతి వి
వాదా సప్తాశ్వ తేజ వరుసగ నిపుడో
శ్రీదాయని పల్మారున్
మోదంబిడ గావ్యరీతి బూజల్ జేతున్
రెట్టించి రాఘవేంద్రా
దిట్టంబొడ్డిట్లు గొల్తు ధీకల్యాఢ్యా
వట్టిక నీవై మనుటే
గట్టిపదవి గాదె యనిశ కారుణ్యాత్మా
ఒకటవ దళములో
రాధానాథా నీతి వివాదా స
రెండవ దళములో
ప్తాశ్వ తేజ వరుసగ నిపు
మూడవ దళములో
డో శ్రీదాయని పల్మారున్మోదం
నాలుగవ దళములో
బి డ గావ్యరీతి బూజల్ జేతున్
ఐదవ దళములో
రెట్టించి రాఘవేంద్రా దిట్టంబొడ్డి
ఆరవ దళములో
డ్డిట్లు గొల్తు ధీకల్యాఢ్యా వట్టి
ఏడవ దళములో
క నీవై మనుటే గట్టిపద
ఎనిమిదవ దళములో
వి గాదె యనిశ కారుణ్యాత్మా
వ్రాయబడినవి-
ఈ బంధాన్ని గమనిస్తే
కేసరాగ్రములో
రాప్తాడోబి రెడ్డి కవి - అని,
తిరుపతి వేంకటేశ - అని కృతిపతిపేరు
పత్రాగ్రంలోనూ కూర్చబడినది.
No comments:
Post a Comment