Friday, September 2, 2016

చిత్రచరిత్రో యస్య హి వరచరణ


చిత్రచరిత్రో యస్య హి వరచరణ


సాహితీమిత్రులారా!

ఈ ప్రహేలికను చూడండి.

నజయతి చిత్రచరిత్రో
యస్య హి వరచరణ పుష్కరకరేణు:
మహిషీం ఋషిసింహస్య
ప్రాజీజనదపి వృషోదయే హేతు:
(సుభాషితరత్నభాండాగారమ్ - 4- 53)

ఎవని యొక్క మంచికాళ్ళు  తొండముగల కరేణువు
వృషోదయ హేతువై ఋషిసింహమునకు సంబంధించిన
గేదెను కనెను - అనేది  దీని అర్థం.
ఇది విపరీతార్థంగా కనబడుతోందికదా!
ఇదే దీని చమత్కారం.

యస్య - ఏ రామచంద్రుని యొక్క, వర - శ్రేష్ఠమైన,
చరణ పుష్కరక - చరణసరోజము యొక్క,
రేణు: - ధూళి, వృషోదయే హేతు: - పుణ్యాభివృద్ధియందు హేతువై,
ఋషి సింహస్య - ఋషి శ్రేష్ఠుడైన గౌతముని యొక్క,
మహిషీం - భార్యయైన అహల్యను,
ప్రాజీజనత్ - యథారూపముగల దానిగా ఒనర్చెనో,
చిత్రచరిత్ర న: - విచిత్ర చరిత్రగల ఆ శ్రీరాముడు,
జయతి - సర్వోత్కృష్టుడు అగుచున్నాడు-
ఇది సరైన అర్థం.

No comments: