Monday, September 5, 2016

కూజితం రతికూజితమ్


కూజితం రతికూజితమ్


సాహితీమిత్రులారా!


ఒక పడుచు కడవతో నీళ్ళు తెస్తున్నది.
ఆమె కడవను భుజముపై పెట్టుకొని తెస్తున్నపుడు
కడవలోనుండి ఒకవిధమైన శబ్దము వినవచ్చినది.
దాన్ని ఆదారిన వెళుతున్న భోజుడు విని, చూచి
ఈ విధంగా ఊహించాడు.
"ఆ కడవ(అను పురుషుడు) ఈ ఇంతి కంఠము
కౌగిలించుకొన కూజితము చేసినట్టు."

ఇదే విషయాన్ని సభకు వచ్చి
సమస్యగా ఇచ్చి కాళిదాసును పూరించమన్నాడు.

సమస్య - కూజితం రతికూజితమ్

దానికి రాజుగారి
మనసెరిగిన కాళిదాసు పూరణ-

విదగ్దే సుముఖే రక్తే నితంబోపరి సంస్థితే
కామిన్యాశ్లిష్టసుగళే కూజితం రతికూజితమ్

విదగ్దే - చక్కగా కాల్చబడినదియు (నేర్పరియు),
సుముఖే - అందమైనమూతి గలదియు (సుముఖుడును),
రక్తే - ఎర్రరంగు వచ్చిననదియు (అనురాగం కలవాడును),
నితంబోపరి సంస్థితే - నితంబములమీద ఉన్నదియు (నితంబములమీది కెక్కిన వాడును),
కామిన్యాశ్లిష్టసుగళే - కాంతచే కౌగిలింపబడిన కంఠము కలదియు (కంఠం కలవాడును)
అగు కడవయందు(పురుషునియందు) పుట్టిన ధ్వని రతికూజితమగుచున్నది - అని భావం.




No comments: