Friday, September 2, 2016

గుళు గుగ్గుళు గుగ్గుళు


గుళు గుగ్గుళు గుగ్గుళు


సాహితీమిత్రులారా!


భోజమహారాజు ఒకరోజు  వేటకు వెళ్ళి అలసి విశ్రాంతికై
ఒక నేరేడు చెట్టు క్రింద సేదతీరుచున్న సమయంలో
ఆ నేరేడు చెట్టుపైకి ఎక్కిన కోతులు చెట్టుకొమ్మలను ఊపుతున్నవి
దానివల్ల నేరేడు పళ్ళు నీటిలో బుడుంగం బుడుంగు మంటూ పడుతున్నాయి
ఆ వినోదం కొంతసేపు చూచి చివరికి ఇంటికి వెళ్ళాడు.
అడవిలో తను చూచిన దృశ్యం ఒక సమస్యగా
సభవారికి చెప్పి పూరించమన్నాడట.
సమస్య- గుళు గుగ్గుళు గుగ్గుళు

దీనికి రాజు అభిప్రాయం తెలిసిన
కాళిదాసు ఈ విధంగా పూరించాడు

జంబూఫలాని పక్వాని పతంతి విమలే జలే
పికంపితశాఖాభ్యో గుళు గుగ్గుళు గుగ్గుళు

(నీళ్ళ ఒడ్డునున్న నేరేడు చెట్టు పండియుండగా
దాని మీదికి కోతులు వచ్చి కొమ్మలను ఊపగా
ఆ కొమ్మల నుండి పండ్లురాలి క్రింది
నీటిలో గుళు గుగ్గుళు  గుగ్గుళు
అనే శబ్దం చేస్తూ పడ్డాయి.)

ఇది విన్న భోజుడు చాలా సంతోషించాడట.

No comments: