ప్రమాణం చేయటానికి ఏమాట వాడుతారు?
సాహితీమిత్రులారా!
ఈ శ్లోకంలోని రెండు ప్రశ్నలను గమనించి
సంస్కృతాంధ్రములలో ఒకేమాట సమాధానం చెప్పండి
ప్రభాతే కీదృశం వ్యోమ? ప్రమాణే కీదృశం వచ:?
ఆంధ్రగీర్వాణ భాషాభ్యా మేక మేవోత్తరం వద
ప్రశ్నలు -
1. ప్రభాతే కీదృశం వ్యోమ?
( ప్రాత కాలంలో ఆకాశం ఎలా ఉంటుంది?)
- నీతోడు (నీత + ఉడు - తొలగిన నక్షత్రాలు కలది
ఇది సంస్కృతపదం)
2. ప్రమాణే కీదృశం వచ:?
(ప్రమాణం చేయటానికి ఎటువంటి మాట వాడుతారు?)
- నీతోడు (ఇది తెలుగుమాట)రెండు భాషల్లోను
ఒకే పదం నీతోడు అని ఉపయోగించి
సమాధానం చెప్పడం ఎంత చిత్రం
ఇది భాషాచిత్రం నకు చెందినది
No comments:
Post a Comment