ఆలి నొల్లక యున్న వానమ్మ మగని
సాహితీమిత్రులారా!
ఆశీర్వాద పద్యాలలో గూఢంగా
ఆశీర్వాదం చెప్పడం కొన్నిటిని చూచాము
ఇప్పుడు మరొకటి.
ఆలి నొల్లక యున్న వానమ్మ మగని
అందులో డాగి యున్న వానక్క మగని
నమ్మినాతని జెరుచు దానమ్మ సవతి
సిరులు దయజేసి మిమ్ము రక్షించుగాత
ఆలినొల్లకయున్నవాడు - భీష్ముడు
అతని అమ్మ - గంగాదేవి
ఆమె మగడు - సముద్రుడు
అందులో దాగి ఉన్నవాడు - మైనాకుడు
వాని అక్క - పార్వతి
ఆమె మగడు - శివుడు
అతనిని నమ్మినవాడు - రావణాసురుడు
అతని జెరిచినది - సీత
దాని అమ్మ - భూదేవి
ఆమె సవతి - లక్ష్మి
సిరులు దయచేసి మిమ్ము రక్షించు గాత
No comments:
Post a Comment