మేఁడి - మేడి పదాలకు అర్థమేమి?
సాహితీమిత్రులారా!
ఈ పొడుపు పద్యం చూడండి
ఇందులో అర్థభేదంతో ఉన్న పదాలకు అర్థం చెప్పాలి.
చూడండి మరి
దీపమనఁగనేమి? ద్వీపమనఁ నేమి?
వేఱర్థములవేవి వేంకటేశ?
మేఁడియనఁగనేమి? మేడియనఁగనేమి?
వేఱర్థములవేవి వేంకటేశ?
మూఁకు డనఁగనేమి? మూకుఁడనఁగనేమి?
వేఱర్థములవేవి వేంకటేశ?
గాఁడియనఁగనేమి? గాడియనఁగనేమి?
వేఱర్థములవేవి వేంకటేశ?
దివియనఁగనర్థమేమియౌ? దివిజవినుత!
దీవియన నర్థమేమియౌ? దేవ దేవ
మెప్పుగా నర్థభేదాలు చెప్పవలయు
దేవ శ్రీవేంకటేశ! పద్మావతీశ!
వీనికి అర్థాలు చెప్పగలరా ఆలోచించండి.
1. దీపము - జ్యోతి
2. ద్వీపము - సముద్రమధ్య భూభాగము
3. మేఁడి - నాగేటి యూతకొయ్య
4. మేడి - అత్తి చెట్టు
5. మూఁకుడు - మట్టి తట్ట
6. మూకుఁడు - ఒక రాక్షసుడు
7. గాఁడి - కడగాలు
8. గాడి - బండి
9. దివి - స్వర్గము
10. దీవి - ద్వీపము
No comments:
Post a Comment