Sunday, September 4, 2016

శ్రీరంగనాథుని పాదాలకు నమస్కారం (నాగబంధం)


శ్రీరంగనాథుని పాదాలకు నమస్కారం 

( నాగబంధం)

సాహితీమిత్రులారా!

ఇంతకుమునుపు గోమూత్రికాబంధంలో ఒక విధాన్ని తెలిసికొన్నము. ఇపుడు  నాగబంధం గురించి తెలుసుకుందాం.

నాగబంధం అనేక విధాలుగా రచించారు. దీనికే మరికొన్ని పేర్లు శేషబంధం, కుండలీ బంధం లాంటి పేర్లు ఉన్నాయి. దీన్ని సాధారణ నాగబంధంగా పెప్పవచ్చు.

స్రగ్ధరావృత్తంలో 21 అక్షరాలు పాదానికి నాలుగుపాదాలకు 21 x 4 = 84 అక్షరాలు
వీటిలో 21 అక్షరాలు రెండు పర్యాయాలు వచ్చేట్లు కూర్చబడుతుంది.
ఈ 21 అక్షరాలు కూడళ్ళలో రావడం జరుగుతుంది.
స్రగ్ధర వలెనే చంపకమాలావృత్తానికి 21 అక్షరాలే కావున
సంస్కృతంలో స్రగ్ధరను తెలుగులో చంపకమాలను
నాగబంధానికి ఎక్కువగా వాడారు.


ఈ క్రింది ఉదాహరణ చూస్తే మరికొంత అవగాహనకు
 వీలౌతుంది గమనించండి.

శ్రీరంగే శన్య వందే పదమృజు ముని ముద్దాయిన: వ్రశ్రితాజం
పద్మా వస్యావనౌ నద్విశద నవనఖం సద్విపన్నాశదాయి
పావవ్రాతాభివన్నా వనమన్తమమరుత్త్రా నలావంలస ద్భా
మృష్టం శత్రు ప్రతాప క్రమ శమనపటో: పద్మ వచ్చారు సారమ్
                                              (అలంకారశిరోభూషణే శబ్దాలంకార ప్రకరణమ్ - 6)

ఋజువర్తనులైన మునులకు ముదాన్నిచ్చేవి,
లక్ష్మిని కాపాడునవి శత్రువుల ప్రతాపాన్ని ఆక్రమణాన్ని
అణచుటయందు నేర్పు కలవి, బ్రహ్మకు ఆశ్రయమైనవి
నక్షత్రాల వలె మెరుస్తున్న గోళ్ళుకలవి.
ఆపదలో ఉన్నవారికి భక్తిని కలిగించేవి,
ఆపదలను పొందినవారిని రక్షించేవి, గొప్పవారగు
దేవతల భయాన్ని పోగొట్టేవి, నిరంతరం ప్రకాశించేవి,
పద్మాలవలె సౌందర్యాతిశయం కలిగినవి అయిన
శ్రీరంగనాథుని పాదాలకు నమస్కారం - అని భావం.

ఈ బంధాన్ని తల నుండి మొదలు పెట్టి తోక వరకు చదివిన పై శ్లోకము వస్తుంది.


No comments: