దీని భావమేమి?
సాహితీమిత్రులారా!
ఈ పొడుపు పద్యం సమాధానం
చెప్పగలరేమో చూడండి-
ముద్దుగ పెరిగేటి ముక్కు పట్టుచునుండు
చెవిలు రెండు లాగి, చెంపనూకు,
దండి పండితులకు దారిచూపుట వృత్తి
దీనిభావమేమి? తిరుమలేశ!
ముక్కు పట్టుకుంటుందట
రెండు చెవులను చెంపలకు
లాగుతుందట పెద్దపెద్ద పండితులకు
దారిచూపడమే వృత్తి గా ఉండేది
ఏమిటది -
సమాధానం - సులోచనాలు(కళ్లజోడు)
ఇవి ముక్కను పట్టుకొంటాయికదా
రెండు చెవులను చెంపలకేసి లాగుతాయికదా
పెద్దపెద్ద పండితులకు చదువటానికి దారికదా
కాబట్టి సమాధానం సులోచనాలు/కళ్లజోడు
సరిపోయింది.
No comments:
Post a Comment