ప్రతిలోమానులోమకందము
సాహితీమిత్రులారా!
ఒక పద్యాన్ని మొదటినుండి చదివినా
చివరనుండి మొదటికి చదివినా
ఒకలాగే ఉంటే దాన్ని
ప్రతిలోమానులోమము అంటారు
అది కందమైతే ప్రతిలోమానులోమకందము అంటారు.
దీన్నే అనులోమవిలోమ కందమనికూడ అనవచ్చు.
ఇలాంటిదానికి ఉదాహరణ ఇక్కడ చూద్దాం-
నంది మల్లయ్య - ఘంట సింగన్న లు
వ్రాసిన వరాహపురాణములోనిది -
సారసనయనాఘనజఘ
నారచితరతారకలికహరసారరసా
సారరసారహకలికర
తారతచిరనాఘజనఘనాయనసరసా
(వరాహపురాణము - 9- 155)
సారసనయనాఘనజఘ
నారచితరతారకలికహరసారరసా
సారరసారహకలికర
తారతచిరనాఘజనఘనాయనసరసా
సారసనయనాఘనజఘ - నారచితరతారకలికహరసారరసా
సారరసారహకలికర-తారతచిరనాఘజనఘనాయనసరసా
ఈ రెండు పాదాలను సరిగా గమనించండి.
ఇందులో మొదటి వరుసలో ఉన్న అక్షరక్రమమే
విలోమంగా రెండవ వరుసలో ఉన్నాయి.
ఈ విధంగా రావడం వలన ఎటుచదివినా
ఒకలాగే వస్తుంది. అందువల్ల దీన్ని
ప్రతిలోమానులోమ కందం అంటున్నాము.
దీనిలో మరో గమ్మత్తుకూడ ఉంచారు ఈ జంటకవులు
అదేమిటంటే ఈ పద్యం పెదిమలు తగలకుండా చదువవచ్చు
అంటే ఇది నిరోష్ఠ్యం కూడా
No comments:
Post a Comment