గౌరీ ముఖం చుమ్బతి వాసుదేవః
సాహితీమిత్రులారా!
సమస్య-
గౌరీ ముఖం చుమ్బతి వాసుదేవః
పూర్వకవి పూరణ-
కా శంభుకాన్తా? కిము చంద్రకాన్తం?
కాన్తా ముఖం కింకురుతే భుజంగః?
కః శ్రీపతిః? కా విషమా సమస్యా?
గౌరీ ముఖం చుమ్బతి వాసుదేవః
ఈ సమస్యను క్రమాలంకారంలో పూరించడం జరిగింది.
ఇందులో 5 ప్రశ్నలున్నాయి
వాటి సమాధానాలు చివరిపాదంలో ఇవ్వబడ్డాయి.
కావున దీన్ని అంతర్లాపికా ప్రహేలిక అని కూడ
అనవచ్చు.
ఇందులోని ప్రశ్నలు సమాధానాలు-
1. కా శంభుకాన్తా?
శివుని ప్రియురాలెవరు?
- గౌరీ(పార్వతి)
2. కిము చంద్రకాన్తం?
చంద్రునివలె అందమైనదేది?
- ముఖం (మొగము)
3. కాన్తా ముఖం కింకురుతే భుజంగః?
విటుడు ప్రేయసి ముఖాన్ని ఏమిచేస్తాడు?
- చుమ్బతి (ముద్దు పెట్టుకొనును)
4. కః శ్రీపతిః ?
లక్ష్మికి భర్త ఎవరు?
- వాసుదేవః (విష్ణువు/కృష్ణుడు)
5. కా విషమా సమస్యా?
విషమ సమస్య ఏది?
- గౌరీ ముఖం చుమ్బతి వాసుదేవః
(పార్వతి ముఖమును కృష్ణడు ముద్దు
పెట్టుకొనుచున్నాడు)
అనేది చిక్కైన సమస్య
No comments:
Post a Comment