Wednesday, March 8, 2017

మతిలేని నరుండు మిగుల మన్నన నొందున్


మతిలేని నరుండు మిగుల మన్నన నొందున్




సాహితీమిత్రులారా!



సమస్య -
మతిలేని నరుండు మిగుల మన్నన నొందున్


మోచర్ల వెంకనకవి  పూరణ-

హిత మాచరించువారికి
హిత మొనరించుచును సుజనహితుఁడగుచును దు
ష్కృత మెప్పుడుఁ జేయను స
మతిలేని నరుండు మిగుల మన్నన నొందున్



ఇందులో మతిలేని వాడుకాదు సమ్మతి లేని వాడు
అని పూరించడంతో విరుద్ధార్థము సమసిపోయినది.


మీరును మరోరకంగా పూరించి పంపండి

No comments: