Wednesday, March 8, 2017

వరాహపురాణములోని చిత్రకవిత - 1


వరాహపురాణములోని చిత్రకవిత - 1




సాహితీమిత్రులారా!


తెలుగులోని మొదటి జంటకవులు
నంది మల్లయ- ఘంట సింగయ.
వీరు కడపజిల్లాలోని
రాచవీడు(రాయచోటి)కు
చెందినవారు
వీరు వరాహపురాణము,
ప్రబోధచంద్రోదయము
అను గ్రంథాలను వ్రాశారు
ఇక్కడ వరాహపురాణములోని
చిత్రకవితను చూద్దాం.
తెలుగులో నన్నెచోడుని తరువాత
చిత్రకవిత వ్రాసి చిత్రకవులకు
మార్గదర్శకులైనారు.

తెలుగులో మొదటి ఏకాక్షరి,
ద్వ్యక్షరి, పంచాక్షరి కూర్చినవారు వీరే.


ఏకాక్షరి-
- కారముతో కూర్చబడినది.

నానాననునిననూనున
నేను నిను ననున్ను నెన్న నీనీననిను
న్నానొని న నోన్ని నానౌ
నేనే నను నన్నునాన నేనను నన్నన్
                                                         (వరాహపురాణము- 10- 90)



ద్వ్యక్షరి -
క- - అనే హల్లులతో కూర్చబడినది.

కాక లికా క
కోకికులీలలులకులుకులుకే
కైకోకు కేలి కొలఁకు
కోకాళీకేళి కులికి కొంకకు కలికీ
                                               (వరాహపురాణము - 11 - 69)


పంచాక్షరి-
నమశ్శివాయ పంచాక్షరీ సీసము
ఇందులో --శ--య - అనే
హల్లులను ఉపయోగించి కూర్చబడినది.

నిమాయా నివే నో
                    మౌనిశ్యాశ్శివా
యానామాన నానాన నవా
                    మ్నా యా శ్శివా
యోని యామినీ మేశ శశ్యంశు
                   న్ననాయ శ్శివా
వ్యోమానుయాయి మా యామావా
                   మాననాశాయ శ్శివా
ని విము మునిమును విశ్వ
ను మ్మున నెమ్మినై నున్న నన్ను
నెమ్మమ్మున నమ్మిన నెమ్మినేను
నోము నీశా యిమ్మన్నదేమి నిన
                                                           (వరాహపురాణము - 10 - 56)

దీనిలో గీతపద్యం చివరిపాదంలో (దే) అన్నది తప్ప
మిగిలిన పద్యమంతా పంచాక్షరాలతోటే సాగింది.
మీరును గమనించండి.



No comments: