Tuesday, March 7, 2017

దీని సమాధానమేమి?


దీని సమాధానమేమి?



సాహితీమిత్రులారా!



ఈ హిందీ ప్రహేలిక చూడండి-
దీన్ని అమీర్ ఖుస్రో కూర్చారు.

ఆది కటే తే సబకో సాలై
మధ్యకటేతే సబకో ఖాలై
అన్త కటేతే సబకో మీఠా
సో ఖుసరోగై అంఖేఁదీఠా

దీని సమాధానంలోని మొదటి అక్షరాన్ని తీసివేస్తే
దాని అర్థం అందరినీ రక్షించేది అవుతుంది.
మధ్యలోని అక్షరం తోలగిస్తే అది సమయం
తెలిపే పదమౌతుంది. చివరి అక్షరం తీసివేస్తే
తీయదనాన్ని ప్రయోజన్నాని తెలిపే పదమౌతుంది
ఇది అమీర్ ఖుస్రో ప్రత్యేక దృష్టి - అని భావం.
సమాధానం ఏమిటో చెప్పగలరేమో ఆలోచించండి-

సమాధానం మూడక్షరాలని పై భావం వల్ల తెలుస్తుంది.
సమాధానం - కాజల

1. మొదటి అక్షరం తీసేస్తే - జల
      ఇది అందరిని రక్షించేదేకదా

2. మధ్యలోని అక్షరం తీసేస్తే - కాల
     ఇది యముడు, మరణం, సమయం అనే
      అర్థాల నిస్తుందికదా

3. చివరి అక్షరం తీసివేస్తే - కాజ
     ఇది కార్య, ప్రయోజన, వ్యవసాయ,
     వివాహ మొదలైన తీయటి
     అర్థాలనిస్తుంది కదా

అందువల్ల దీని జవాబు - కాజల
సరిపోయిందికదా!

No comments: