Friday, March 10, 2017

దొర్లుతూ తిడుతున్నావెందుకు?


దొర్లుతూ తిడుతున్నావెందుకు?




సాహితీమిత్రులారా!



కృష్ణకవి కృత మందారమరందచంపూః లోని
ఈ శ్లోకం చూడండి-

మారనారాచ నిర్భిన్న - 
మానసా మత్తకాశినీ
మన్దరం మృగశాబాక్షీ-
ముహుర్నిన్దతి లుంఠతి

మన్మథ బాణాలచే చీల్చబడిన మనస్సుగల,
మదముతో ప్రకాశిస్తున్న, ఆ బాలహరిణేక్షణ,
మందర పర్వతాన్ని మాటిమాటికీ నిందిస్తూ,
దొర్లుతున్నది ఎందువలన?

చంద్రోదయము కామినులలో విరహ వ్యథను పెంచుతుంది.
అందువలన చంద్రోదయము కాకుండా, మందరపర్వతం
అడ్డుపడి, తనకు సహాయం చేయలేదని, మందర పర్వతాన్ని
తిడుతూ, ఆ చంద్రోదయంతో వియోగ బాధను తట్టుకొనలేక
దొర్లుతూన్నది - అనే భావాన్ని గుప్తంగా ఉంచడం జరిగింది
అందువలన దీన్ని భావగుప్తానికి ఉదాహరణగా చెప్పవచ్చు.

No comments: