అతను సుతను వెతను
సాహితీమిత్రులారా!
దత్తపది-
శివతపస్సును
అతను,
సుతను,
వెతను,
జతను
అనే వాటిని ఉపయోగించి వర్ణించుట.
సింహాద్రి శ్రీరంగము గారి పూరణ -
అతనుడు వింటి నెక్కిడె మహానటుడై హిమశైల రాజస
త్సుత, నుతి పాత్ర పెండ్లియయి సూరిని గాంచగ లోకజాల ముల్
వెతలు తరింపగా నెరిగి వేల్పులరాయడు కంటిమంటచే
జతనువిడంగజేసి సుమసాయకు భస్మము చేసె నుగ్రుడై
ఇచ్చిన పదాలను(దత్తపదులను) ఉపయోగించి
శివతపస్సును చక్కగా వర్ణించాడు
ఇందులో ఎక్కువగా అచ్చతెలుగు
పదాలను వాడటం జరిగింది.
(అతనుడు - మన్మథుడు)
No comments:
Post a Comment