Thursday, March 2, 2017

రమణితో రమింప రవిచెలంగె


రమణితో రమింప రవిచెలంగె




సాహితీమిత్రులారా!


ఈ ప్రహేలికా పద్యం చూడండి-

రేయి యెండగాసె రేవెల్గు వేడియై
వెలిగె వేవెలుంగు కలువకన్నె
నవ్వజేసె తొగల నాథుడు పద్మినీ
రమణి రమింప(రామియింప)రవిచెలంగె

ఈ పద్యంలో సాధారణంగా
మనకు కనిపించే అర్థం-

చంద్రుడు వేడిగా ప్రకాశిస్తున్నాడు.
సూర్యుడు కలువకన్నెను నవ్విస్తున్నాడు.
చంద్రుడు పద్మినీ కాంతతో రమిస్తున్నాడు.
సూర్యుడు సంతోషిస్తున్నాడు
ఇది సరైనదేనా ఇందులో అన్నీ విపరీతమైన
అసభ్యకరమైన విషయాలు కనిపిస్తున్నాయి.
మరి సరైన అర్థం ఎలా తీసుకోవాలి అంటే
పద్యాన్ని ఇలా విరుచుకోవాలి-

రేయియెండ గాసె రేవెల్గు
వేడియై వెలిగె వేవెలుంగు
కలువకన్నె నవ్వగజేసె తొగలనాథుడు
పద్మినీ రమణితో రమింప రవిచెలంగె
ఈ విధంగా మార్చుకున్నపుడు
అర్థం -
చంద్రుడు వెన్నెల(రేయియెండ)గాసె,
సూర్యుడు(వేవెలుంగు) వేడిగా వెలిగెను,
చంద్రుడు కలువకన్నెను నవ్విం(విసింపచేసెను)చెను
సూర్యుడు పద్మలతతో పరవశించెను

ఇప్పుడు అర్థం సరిపోయింది కదా!


No comments: