కుందేటికి కొమ్ములాఱు కుక్కకువలెనే
సాహితీమిత్రులారా!
సమస్య-
కుందేటికి కొమ్ములాఱు కుక్కకువలెనే
ఇది కవిజీవనోజ్జీవని లోని సమస్య-
కోటిశ్రీరాయరఘునాథ
తొండమాన్ మహీపాలుని పూరణ-
మందకడఁ దఱిమి పట్టిన
నందుల మూఁడు పసరమ్ము లదరి పొడిచినన్
ముందుబడి వెనుక దూసెను
గుందేటికిఁ గొమ్ములాఱుఁ గుక్కకువలెనే
ఇందులో కుందేటికి ఆరు కొమ్ములుకాదు
పశువులు పొడువగా ఆరు కొమ్ములు
దూసుకుపోయినవట కుక్కకువలెనే
అంటున్నాడు.
No comments:
Post a Comment