Wednesday, March 1, 2017

నాద్యక్షరము మాన నశ్వవేది


నాద్యక్షరము మాన నశ్వవేది




సాహితీమిత్రులారా!



కొఱవి గోపరాజు కృత
సింహాసనద్వాత్రింశిక లోని
ఈ పద్యం చూడండి-
ఒక కవి పేరును ఏవిధంగా చెబుతున్నడో-

రాజేంద్ర! యారక్షరముల పేరిటివాఁడ
        నాద్యక్షరము మాన నశ్వవేది
రెండక్షరములఁ బరిత్యజించిన నాట్య
        కర్త, మూడుడిపిన గతవిదుండ
నాలుగు నుడిగింపఁ జాలనేర్పరి, నైదు
        విడచిన బుధుఁడ, నీ విధముగాత
సర్వాక్షరంబులుఁ జదివిచూచిన బుద్ధి
        బలముఁగాఁగలయట్టి ప్రౌఢుఁడనఁగ
నేతిబీఱకాయ నీతి గాకుండఁగ
నిన్ని విద్యలందు నెన్నఁబడ్డ
సార్థనాముఁడైన యర్థిగా నెఱుఁగుము
విబుధ పంకజార్క! విక్రమార్క!
                                                       (సింహాసనద్వాత్రింశిక - 2-47)

ఈ పద్యంలో కవి తన పేరును
ఆరు అక్షరముల పేరుగా చెప్పాడు.
అందులో మొదటి అక్షరం తీసివేసిన
అశ్వవేది అవుతుందట.
అలాగే రెండక్షరాలు తీసివేస్తే
నాట్యకర్త అవుతుందట.
మబడక్షరాలు తీసివేస్తే
చాలనేర్పరి అని వస్తుందట.
అయిదక్షరాలు తీసివేస్తే
పండితుడవుతందట.
అన్ని అక్షరాలను కలిపి చదివిన
మహాబుద్ధిశాలి అవుతుిందట.
అతని పేరేమిటో కనుక్కోవాలంటే
ఆలోచించాల్సిందే కదా

సమాధానం - చతురంగతజ్ఞ

దీనిలో మొదటి అక్షరం తీసివేసిన - తురంగతజ్ఞ
దీని అర్థం - అశ్వవేది
(గుఱ్ఱములను గురించి తెలిసినవాడు)
రెండక్షరములు తీసివేసిన - రంగతజ్ఞ
అంటే నాట్యకర్త(నాట్యం బాగా తెలిసినవాడు)
మూడక్షరములు తీసివేసిన - గతజ్ఞ
అంటే గతమునెరిగినవాడు
నాగక్షరములు తీసివేసిన - తజ్ఞ
అంటే చాల నేర్పరి (అని అర్థమట)
అయిదక్షరములు తీసివేసిన - జ్ఞ
అంటే పండితుడు
అన్నీ కలిపిన చదివిన - చతురంగతజ్ఞ
అంటే మహాబుద్ధిశాలి
ఇప్పుడు ్న్నీ సరిగా సరిపోయాయి కావున
సమాధానం- చతురంగతజ్ఞ


No comments: