గుణితపద్యం
సాహితీమిత్రులారా!
ఇంతకుముందు మనం గుణితపద్యం ఒకదాన్ని చూశాము.
అందులో పద్యం మొత్తం గుణితం ఉంది.
అది ఒక రకము కాగా సగం పద్యంలోనే గుణింమంతా రావడం రెండవ రకం గుణింత పద్యం.
అంటే ఒక పద్యంలో రెండు గుణింతాలు కూడా కూర్చిన వారున్నారు.
ఈ పద్యం గణపవరపు వేంకటకవి
"ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసము"లోని
148వ పద్యం.
గడి గాటపు గిరి గీముల
గుడి గూబల గెబ్బు గైత గొల్లలు గౌలన్
(దడలుచు గండరిగర్వము
విడుతురు నీరిపులు జేరి వేంకటశౌరీ)
వరరాముఁగోరిరీతఁడు
గురురూపిమ రేవురైయెకుదిరిరొయొనరౌ
నరనాధునిరతినీచుల
నురినూకువనేర్పనైననోపికనౌఁగా
(ఉరిన్ - ఉచ్చులో, ఊకువన్ - పూనికను, ఏర్పన్ - ఏర్పరచుట)
ఈ పద్యంలో "ర" - మొదటి సగం పద్యంలోను, "న" - రెండవ సగం పద్యంలోను గుణితము కలదు.
(ఇది నాదెళ్ళ పురుషోత్తమకవి "అద్భుతోత్తరరామాయణము"లోనిది)
3 comments:
అద్భుతమైన పద్యాలను పరిచయం చేశారు. ధన్యవాదాలు.
మీ బ్లాగు అద్భుతంగా ఉంది.మీరు ప్రొద్దుటూరులో ఉంటున్నట్లు మా గురువుగారు శ్రీకంది శంకరయ్యగారి ద్వారా తెలిసింది.మీరెక్కడుంటారు.వీలైతే కలుద్దామండి.నేనునూ ప్రొద్దుటూరు లోనే యుంటాను.
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారికి,
నమస్కారం. మీరు బ్లాగును చూచి మీ ఆనందాన్ని వ్యక్తం చేసినందుకు నేను చేసే పనికి మరింత ఊతం అవుతుంది. మీరు మావూరి వారవడం నాకు మరీ సంతోషం. మీరు మీ ఈ-మెయిల్ నాకు పంపండి నా అడ్రసు వివరాలను మీకు పంపగలను. ధన్యవాదములు.
Post a Comment