గోపుచ్ఛాకృతి చిత్రం
సాహితీమిత్రులారా!
పుచ్ఛం అంటే తోక, గోపుచ్ఛాకృతి
అంటే గోవు తోకలా మొదట లావుగా ఉండి
పోనుపోను సన్నగా అయితే అది గోపుచ్ఛాకృతి.
ఇలాటివి చిత్రకవిత్వంలో కనిపిస్తాయి.
ఇక్కడ కొన్ని చూద్దాం.
ధరసుధా రసుధా సుధా ధార కదళికా దళికా ళికా కలిత మగుచు,
మవరమా వరమా రమా మానుజ లవలీ లవలీ వలీ లీల లవని మెఱయ
శరతుషా రతుషా తుషా సార లవసితా వసితా సితా తార ఫణి సమంబు,
శరదశా రదశా దశా శాంత భగణితా గణితా ణితా తారకా పథంబు,
ఖగముఖాగ ముఖా ముఖా భాగ మగుచు
హరిపురా రిపురా పురా రాతి యగుచు
భవసభా రసభా సభా భవ్యమగుచు
యశము, శము, ముద మొదవు యాచాథిపతికి
(చాటుపద్య రత్నాకరం 3-109)
ఇందులో ప్రతిపాదంలో మొదట ఉన్న అక్షరంలో
ఒక అక్షరం తగ్గుతూ రావడం గమనించ వచ్చు.
ఇది ఆవుతోకలా కనిపిస్తుంది
కావున
ఇది గోపుచ్ఛాకృతి చిత్రం.
No comments:
Post a Comment