ఆదివర్ణావృత్తి
సాహితీమిత్రులారా!
పద్యంలో మొదటిపదానికి వచ్చిన అక్షరమే పద్యంలోని
ప్రతి పదానికిరావడం దీనిలోని చిత్రం.
ఉదాహరణకు ఒక పద్యం "ర"- అనే దానితో ప్రారంభమైన
పద్యంలోని ప్రతిపదం "ర"-తోనే ప్రారంభించబడుతుంది.
గణపవరపు వేంకటకవిగారి
"ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసము" నుండి
ఈ పద్యం చూడండి.
కలకంఠము కరెపులుగును
కలవింకము కంకణంబు కహ్వము కరుడున్
కలరవము కనకభుక్కును
కళకును కంకమును గాకి కక్కెరకైదన్ (230)
No comments:
Post a Comment