Sunday, May 1, 2016

"దామోదర రదమోదా"


"దామోదర రదమోదా"


సాహితీమిత్రులారా!
నిన్నటి రోజున పాదభ్రమకానికి ఉదాహరణగా ఒక శ్లోకం చూశాం కదా!
ఈ రోజు పాదభ్రమక పద్యం చూద్దాం.
ఇది "విక్రాల శేషాచార్యు"లవారి "శ్రీవేంకటేశ్వరచిత్రరత్నాకరం" ఉత్తర భాగంలోనిది.

దామోదర రదమోదా
రామా తతరా జయ యజరా తతమారా
రామా జని నిజ మారా
భూమా తతభూమతతమ భూతత మాభూ

ఇది ప్రతి పాదం ఎటునుంచి చదివినా ఒకలాగే ఉంటుంది.

(ర - జంకును, ద - ఖండించువాడా, మోదా - ఆనంద స్వరూపుడా
తత - విస్తృతమైన, రా - బంగారు కలవాడా, తత - అధకమైన,
మా - బుద్ధికి, రా - శాలయైనవాడా, రామా - లక్ష్మి వలన, జని - పుట్టుక కల,
నిజ - నిత్యుడైన, మారా - కాముడు కలవాడా, భూమా - విరాట్ స్వరూపుడా,
తత - పెద్దదియగు, భూ - భూదేవికి, మతతమ - మిక్కిలి ప్రియుడా, భూ - భూమివలె,
తత - గొప్పదియగు, మా - లక్ష్మికి, భూ - స్థానమైనవాడా, దామోదర ,
జయ - జయించుము.)

No comments: