Tuesday, May 24, 2016

సుదతీ నూతన మదనా


సుదతీ నూతన మదనా


సాహితీమిత్రులారా!

శబ్దాలంకారాలలో ముక్తపదగ్రస్తము ఒకటి.
ముక్తపదం అంటే విడిచి పెట్టబడిన పదం,
గ్రస్త అంటే తిరిగి గ్రహించడం. ముక్తపదగ్రస్తం అంటే
ఒక పదాన్ని విడిచి పెట్టి మళ్ళీ తీసుకోవడం.
అది పాదం అంతంలో అయితే పాదాంతముక్తపదగ్రస్తం అంటాము.

ఈ ఉదాహరణ చాలా ప్రసిద్ధమైన ఉదాహరణ.
 .

సుదతీ నూతన మదనా
మదనాగ తురంగ పూర్ణమణిమయ సదనా
సదనామయగజరదనా
రద నాగేంద్రనిభకీర్తిరసనరసింహా
                                            (కావ్యాలంకారసంగ్రహము 4-83)

నరసింహా = ఓ నరసరాజా
సగదతీ నూతన మదనా = స్త్రీలకు నవమన్మథుడగువాడా,
మదనాగ తురంగ పూర్ణమణిమయసదనా = మదించిన ఏనుగులతోను గుఱ్ఱముతోను నిండిన,
మణిమయసదనా = మణిమయగృహములు కలవాడా,
సదనామయ గజరదనా = మంచివారికి శుభములు కూర్చుటకు విఘ్నేశ్వరుడగువాడా,
రదనాగేంద్రనిభకీర్తిరస = దంతములతోను, అనంతునితోను సాటియగు
(తెల్లనై) రసమువలె వ్యాపించు కీర్తికలవాడా!

ఎవరు చెప్పినా ఇదే చెబుతారు.
 నేను మొదట్లో ఇంకలేవేమో!
అందుకే ప్రతి ఒక్కరు ఇదే చెబుతారు అనుకునే వాణ్ణి.

కానీ తరువాత నాకు తెలిసిందేమంటే
ఇది ఒక్కటే కంఠస్థమైనది సులభమైనది.
అందుకే ఇలా... అని అర్థమైంది.

1 comment:

Kesava Tadipatri said...

మంచి సైట్. చాల బాగుంది.
అనంతుడు లేక ఆదిశేషుడు తెలుపని ఎక్కడ లేదు. అనంతుడి దంతాల ప్రసక్తి లేదు. నాగము అంటే ఏనుగనె అర్థము సుప్రసిద్ధమే. నాగాయుతబలసంపన్నుడంటారు. నాగేంద్రుడంటె ఐరావతము. ఐరావతము దాని దంతాలు తెలుపని లోకప్రసిద్ధి. అర్థము మార్చవలెనని వినంతి.