Thursday, June 1, 2017

ఇంతినీకు విలువ యెంతనియడిగిన


ఇంతినీకు విలువ యెంతనియడిగిన




సాహితీమిత్రులారా!




ఈ పొడుపు పద్యం విప్పండి-


ఎలనాగ నీదేశ మేదేశమన్నను
         చెలివంగ మ్రానొక్క చేతఁజూపె
భామరో నీవున్న పట్టణంబేదన్నఁ
         చంద్రునిఁగూడు పాషాణమనియె
నిందీవరాక్షి నీ యిల్లెక్కడనియన్న
         తలనీరు మోసిన తరువుఁజూపె
నేజాతి కోమలీ యెఱిగింపు మనియన్న
         నేటిలో రెన్నెల్లు లెసఁగఁబుచ్చె
నలినాయతాక్షి నీ నీమమేమనియన్న
         తఱువాతి దినమని తరుణిచెప్పె
నీపతి యెవడన్న నీరజలోచన
కురులు వ్రేలఁజూపె కోమలాంగి
యింతినీకు విలువ యెంతని టడిగిన
చుక్కచూపి సుదతి సున్నచుట్టె

ఈ పద్యంలో ఒక స్త్రీని అడిగిన ప్రశ్నలు
వాటికి ఆమె చెప్పిన సమాధానాలు ఉన్నాయి.
సమాధానాలు  కనుక్కొని చెప్పండి-


ఎలనాగ నీదేశ మేదేశమన్నను
         చెలివంగ మ్రానొక్క చేతఁజూపె
ఆమె దేశం - వంగదేశం

భామరో నీవున్న పట్టణంబేదన్నఁ
         చంద్రునిఁగూడు పాషాణమనియె
పట్టణం - చంగ్రగిరి

నిందీవరాక్షి నీ యిల్లెక్కడనియన్న
         తలనీరు మోసిన తరువుఁజూపె
ఆమె ఇల్లు - కొబ్బరి చెట్టు దగ్గర

నేజాతి కోమలీ యెఱిగింపు మనియన్న
         నేటిలో రెన్నెల్లు లెసఁగఁబుచ్చె
ఆమె జాతి - భోగమజాతి

నలినాయతాక్షి నీ నీమమేమనియన్న
         తఱువాతి దినమని తరుణిచెప్పె
ఆమె పేరు - మదహంసగమన

నీపతి యెవడన్న నీరజలోచన
కురులు వ్రేలఁజూపె 
ఆమె భర్త- అనేకమంది భర్తలు



కోమలాంగి
యింతినీకు విలువ యెంతని డిగిన
చుక్కచూపి సుదతి సున్నచుట్టె

ఆమె వెల - 10 నిష్కములు

No comments: