హనుమంతుడు, లక్ష్మణుడు, దాశరధి, జానకి
సాహితీమిత్రులారా!
దత్తపది-
హనుమంతుడు,
లక్ష్మణుడు,
దాశరధి,
జానకి - పదాలనుపయోగించి
భారతార్థంలో పూరించాలి
చిర్రావూరి శ్రీరామశర్మ గారి పూరణ-
హనుమంతుండు ధ్వజంబుగాగ నరుడున్ హర్షంబుతో గూడి కృ
ష్ణుని నర్చిఃకృపతోడ దాశరధులన్ శోభిల్లగా నొందె ల
క్ష్మణుడో యుత్తరపుత్రుచే నిహతి నాశాశోభిశ్రీ జానకీ
ఘనతన్ ద్రౌపదిపొందె భారతమునన్ గూఢార్థమింతేకదా
No comments:
Post a Comment