గాండీవమును ధరించినవాడెవడు?
సాహితీమిత్రులారా!
ఈ ప్రహేలికను చూడండి-
గాండీవ వాంస్త్రిభువనే కతమః? శ్రుతా కా-
సం జ్ఞా స్వరస్య? గరుడ ధ్వజకామినీ కా?
ముగ్ధా కురంగనయనా సురత స్పృహాయాం
కాన్తం గిరా మధుకరయా కిము వక్తి? నాజీ
ఈ ప్రహేలికలో నాలుగు ప్రశ్నలున్నాయి
వాటి సమాధానం - నాజీ
అంటే నా - అచ్ - ఈ
అనేవి మరియు నాజీప్రశ్నలు - సమాధానాలు
1. గాండీవ వాంస్త్రిభువనే కతమః?
ముల్లోకాలలో గాండీవమను ధనుస్సును ధరించినవాడెవరు
- నా (నరుడు లేక అర్జునుడు)
2. శ్రుతా కా సం జ్ఞా స్వరస్య?
స్వరములకు (అ,ఆ,ఇ,ఈ,ఉ...మొదలైనవాటికి) పెట్టన పేరు
(స్వరములకు నామాంతరము)
- అచ్ (అచ్చులు)
3. గరుడ ధ్వజకామినీ కా?
గరుడపతాకము గల విష్ణువుయొక్క ప్రియురాలు ఎవరు
- ఈ (లక్ష్మిదేవి)4. ముగ్ధా కురంగనయనా సురత స్పృహాయాం
కాన్తం గిరా మధుకరయా కిము వక్తి?
(అసమయమున) సంభోగము నపేక్షించుపతితో ముద్దరాలగు భార్య,
ఏ తీయని పల్కు పల్కి తప్పించుకొనును
- నాజీ (న - అజీ - అయ్యా ఇప్పుడుకాదు)
అనే నిషేధ వచనమును సవినయముగా పలికి
తప్పించుకొనును.
No comments:
Post a Comment