Thursday, February 1, 2018

కందగర్భగీతం


కందగర్భగీతం




సాహితీమిత్రులారా!


అష్టకాల నృసింహరామశర్మ కృత
"పురుషోత్తముడు" కావ్యంలోని
ఈ గర్భచిత్రం చూడండి-
గీతపద్యంలో కందం ఇమిడ్చి
చెప్పాడీకవి -

గరుడ గమన! శర్వవినుత! సురసుత పద
శ్రీకర! శశి సూర్యనయన! నాకరిపుహ!
మురహర! కరుణాకర! మునివరవినుత చ
రణ! కరివరపాలా! రిపుగణహర! హరి!

ఈ ఆటవెలది పద్యం కందపద్యం దాగి ఉంది
అది-

గరుడ గమన! శర్వవినుత! సురసుత పద
శ్రీకర! శశి సూర్యనయన! నాకరిపుహ!
మురహర! కరుణాకర! మునివరవినుత చ
రణ! కరివరపాలా! రిపుగణహర! హరి!

గరుడ గమన! శర్వవినుత! 
సురసుత పద శ్రీకర! శశి సూర్యనయన! నా
కరిపుహ! మురహర! కరుణా
కర! మునివరవినుత చరణ! కరివరపాలా!

No comments: