Wednesday, February 28, 2018

ఓరోరి అన్నరో, నీ వళ్లంతా ముళ్లురో


ఓరోరి అన్నరో, నీ వళ్లంతా ముళ్లురో




సాహితీమిత్రులారా!





ఈ విచ్చుడు కథలను వినండి విప్పండి

ఓరోరి అన్నరో, 
నీ వళ్లంతా ముళ్లురో,
కారాకు పచ్చరా,
నీ కండంతా చేదురా

దీనికి ఒళ్లంతా ముండ్లు
మరి రంగో కారు(దట్టమైన) పచ్చ
దీని కండంతా చేదు -
అదేమిటో చెప్పాలి.

సమాధానం - కాకరకాయ

ఓహోహో రాజుగారు
వళ్లంతా గజ్జి ఏమిటండీ
కండంతా తీపేమిటండీ

దీని ఒళ్లంతా గజ్జి
కండేమో తీపి ఇదేమిటో చెప్పాలి-

సమాధానం - సీతాఫలం

ఓహో సన్నాసి -
నీ పెయ్యనిండా విభూతి 
నీ సేతులకు శంఖుచక్రాలు
నెత్తిన రుద్రాక్షలు

దీని ఒళ్లంతా విభూతి
చేతులేమో శంఖచక్రాలు
నెత్తిమీద రుద్రాక్షలట-
ఇదేమిటో చెప్పాలి

సమాధానం - ఆముదం చెట్టు

No comments: