Saturday, February 3, 2018

అంత్యోత్తర చిత్రం


అంత్యోత్తర చిత్రం




సాహితీమిత్రులారా!




ప్రహేళికకు సమాధానం అంతంలో ఉంటేదాన్ని
అంత్యోత్తర ప్రహేళిక అంటారు.

కః పత్రీ? కా స్థిరా ?కార్క సంబుద్ధిః? కీ దృశోర్భకః?
కః సేవ్యః? కః పతి ర్బైమ్యాః? "వీరసేన సముద్భవః"

దీనిలో ఆరు ప్రశ్నలున్నాయి వాటి కన్నటికి
సమాధానం - వీరసేన సముద్భవః
విః - రసా - ఇన - సముత్ - భవః
అనేవి ఐదు ప్రశ్నలకు సమాధానాలు కాగా
ఆరవదానికి మొత్తం పదమంతా సమాధానమౌతుంది.

1. కః పత్రీ?
     పక్షి ఏది?
      - విః(పక్షి)

2.    కా స్థిరా ?
       స్థిరమైనదేది?
         - రసా(భూమి)

3.    కార్క సంబుద్ధిః?
       సూర్యసంబోధనమేది?
        - ఇన(ఓ సూర్యుడా)

4. కీ దృశోర్భకః?
    బాలుడెట్టివాడు?
       - సముత్(సంతోషంతో కూడినవాడు)

5. కః సేవ్యః?
    సేవింపదగినవాడు ఎవరు?
       - భవః(ఈశ్వరుడు)

6.   కః పతి ర్బైమ్యాః?
      భీముని కూతురు(దమయంతి) భర్త ఎవరు?
       - వీరసేన సముద్భవః(వీరసేనుని కుమారుడగు నలుడు)

No comments: