ఒకే వస్తువును తింటాం, తాగుతాం, చిబుకుతాం
సాహితీమిత్రులారా!
పొడుపు కథలను సంస్కృతంలో ప్రహేలికలు అని,
ఆంగ్లంలో రెడిల్స్ అని పిలుస్తాం. కాశ్మీరీ వాళ్ళు
ప్రత్ష్ అంటారు. ఇక్కడ కాశ్మీరీ పొడుపుకథలను
కొన్నిటిని గమనిద్దాం-
1. అకి అంద సియహ బే అంద సపేద్
(ఒకవైపు నలుపు మరోవైపు తెలుపు)
- రాత్రి - పగలు
2. సుబహన్ త్సు జొంగ్,
ద్వాహ్లిదు జొంగ్,
షామన్ బాగీ త్రు జొంగ్.
(పొద్దున నాలుగు కాళ్ళు,
మధ్యాహ్నం రెండు కాళ్ళు,
సాయంత్రం మూడు కాళ్ళు)
- మనిషి
మనిషి బాల్యం(పొద్దున) దోగాడుతాడు కదా!
అప్పుడు అతనికి 4 కాళ్ళు.
యౌవనం(మధ్యాహ్నం) రెండు కాళ్ళు.
ముసలితనం(సాయంత్రం) మూడుకాళ్ళు
అంటే రెండు కాళ్ళతోటి ఒక చేతికర్రకూడ
అప్పుడు మూడు కాళ్ళు కదా!
3. ఖ్యోన్ కొన్ త త్రుకున్
(ఒకే వస్తువును తింటాం, తాగుతాం,
చిబుకుతాం అదేమిటి?)
- కరబూజా పండు
4. ఆమ్ త అసాన్ ద్రావ్ త వదాన్
(నవ్వుతూ వస్తాడు, ఏడుస్తూ పోతాడు)
- మంచు
5. యాం జాన్ తామ్ ఖోట్ కానీ పెఠ్
(పుట్టిన వెంటనే అటక ఎక్కి కూర్చుంటుంది)
- పొగ
No comments:
Post a Comment