Tuesday, February 6, 2018

వనజ భవుకంటెఁగడు వెఱ్ఱివాఁడుఁగలఁడె


వనజ భవుకంటెఁగడు వెఱ్ఱివాఁడుఁగలఁడె




సాహితీమిత్రులారా!


సమస్య- 
వనజ భవుకంటెఁగడు వెఱ్ఱివాఁడుఁగలఁడె


సింహాద్రి శ్రీరంగంగారి పూరణ-

కాయకష్టంబుఁజేసెడి ఘనునికింత
గుడువ, ముడువను, వసింపఁగూర్చకుండ
నీడఁగూర్చుండువానికి నిఖిలమిచ్చు
వనజ భవుకంటెఁగడు వెఱ్ఱివాఁడుఁగలఁడె

బ్రహ్మకంటె వెఱ్ఱివాడుండా - అని ప్రశ్నించగలమా?
బ్రహ్మ వెఱ్ఱివాడా మనం అనగలమా?
కవి అవుననే అంటున్నాడు
ఎలాగంటే కష్టం చేసేవానికి తిండి బట్ట గూడు
ఇవ్వకుండా నీడనున్నవానికి అఖిలాన్నిస్తున్నాడు
కాబట్టి వెఱ్ఱివాడంటున్నాడు ఈ విధంగా నిజమేకదా!

No comments: