కందగర్భిత వచనం
సాహితీమిత్రులారా!
ఒకే ఛందస్సులో భిన్న భిన్న ఛందస్సులను
ఇమిడించి వ్రాయడాన్నే గర్భకవిత్వం అంటారు.
ఇక్కడ వచనంలో కందపద్యాన్ని గర్భితంగా కూర్చినది
ఒక దాన్ని చూద్దామా
రసస్రువు అనే కావ్యాన్ని
ఆచార్య వి.యల్.యస్.భీమశంకరం గారు కూర్చారు.
అందులోని ఈ కందగర్భ వచనం చూడండి-
వచనం.
ఆ విధంబున తలంచుచు, తనకు వేరు మార్గంబులేదని
నిశ్చయించి, ఆతడు తన మనమందున దహించు తాపంబు
కతంబున వెలుదెంచెడి దుఃఖంబునంత కఠిన ప్రయత్నమున
నాపంగా సమకట్టి, మహాదేవునిపై దృష్టి మరలించి యిట్లని
ప్రార్థించె.
వచనం.
ఆ విధంబున తలంచుచు, తనకు వేరు మార్గంబులేదనినిశ్చయించి, ఆతడు తన మనమందున దహించు తాపంబు
కతంబున వెలుదెంచెడి దుఃఖంబునంత కఠిన ప్రయత్నమున
నాపంగా సమకట్టి, మహాదేవునిపై దృష్టి మరలించి యిట్లని
ప్రార్థించె.
గర్భిత కందం-
అని నిశ్చయించి ఆతడు
తన మనమందున దహించు తాపంబు కతం
బున వెలుదెంచెడి దుఃఖం
బునంత కఠిన ప్రయత్నమున నాపంగాన్
(రసస్రువు - పుట. 186)
No comments:
Post a Comment