భర్గా శతకం
సాహితీమిత్రులారా!
కపిలవాయి లింగమూర్తిగారి
దుర్గాశతకాన్ని గురించి
ముందు తెలుసుకున్నాం-
ఇప్పుడు రెండవదైన
భర్గా శతకం గురించి వివరంగా తెలుసుకుందాం-
దుర్గా శతకం ఆటవెలదులతో ప్రతిపద్యం
ఒక అలంకారంలో మొత్తం శతకమంతా
దుర్గ అవతారాన్ని అష్టాదశ శక్తిపీఠాలను
దుర్గ తత్వాన్ని మొదలైన అంశాలతో
కూర్చగా భర్గా శతకం శివుడు యతీశ్వరుడు
కావున యతిశతకంగా ఆయన లీలలతో
కూర్చారు. ఇందులోని విషయం
ఈశ్వరుని గురించైతే ప్రతి దానిలో
ఛందస్సుకు సంబంధించి యతులకును
గురించిన లక్ష్యగ్రంథంగా కూర్చారు.
ఉమాదేవిని(దుర్గను) ఆటవెలదిలో స్తుతించగా
శివుని గీతపద్యాలలోని మరోరకమైన తేటగీతిని
శివస్తుతికి వాడారు. దీనిలో 120 పద్యాలను కూర్చాడు.
దీనిలో ఛందోవిషయంగా-
యతిగవేషణం - 22 పద్యాలు
వ్యంజనాక్షర విరతులు - 35 పద్యాలు
ఉభయవళులు - 35 పద్యాలు
ప్రాసయతులు - 28 పద్యాలు
మొత్తం - 120 పద్యాలు
స్వరయతి -
అమృత తత్వంబు నీయది, ఆది పురుష
ఆత్మరూపంబు నీయది, ఐంద్రవినుత
ఐంద్రజాలికుడవు నీవు ఔ కలాప
ఔపనిషదర్థమవు నీవు అభవ భర్గ - 01
వ్యంజనాక్షర యతి -
కంతు కడగంట గాల్పడే కాయికముగ
కాలఫణినైన దాల్పడే కైవసముగ
కైపు విసమైన నిల్పడే గౌరవముగ
కౌశికీపతి నినుమది గనునె భర్గ - 23
ఉభయవళులు-
అచలజా వల్లభా యస్మదజ్ఞత మది
తలచి యిడుముల నిడ కస్మ దార్తి బాపి
ఆదుకొనవయ్య నే యుష్మదంఘ్రి యుగము
నెపుడు నమ్మితి నను భవదీయు భర్గ - 58
No comments:
Post a Comment