Sunday, February 4, 2018

రంభాఫల మెంత విషమో


రంభాఫల మెంత విషమో 




సాహితీమిత్రులారా!



సమస్య-
రంభాఫల మెంత విషమో రసికుఁడెఱుఁగున్
(అరటి పండెంత విషమో రసికునికి తెలుసును)

గాడేపల్లి వీరరాఘవశాస్త్రిగారి పూరణ-
రంభారావణ సంవాదంలో
రంభ రావణునితోను
రావణుడు రంభతోను
అన్నట్లుగా పూరించాడు

గంభీరవాక్కులేటికి
శుంభద్గర్వా విషమ్ము సు మ్మధరమనన్
రంభకు రావణుడనె నిటు
రంభాఫల మెంత విషమో రసికుఁడెఱుఁగున్

రంభాఫలంకాదిక్కడ
రంభా ఫలం ఎంత విషమో
అని రంభను సంబోధించినట్లుగా
కవి మార్చివేశాడు. కావున అరటిపండు విషం
అనే అసంగతం తొలగిపోయింది.

No comments: