Saturday, July 8, 2017

భైరవకవి నాగబంధ - ద్వినాగబంధములు


భైరవకవి నాగబంధ - ద్వినాగబంధములు




సాహితీమిత్రులారా!

భైరవకవి కృత శ్రీరంగమహాత్మ్యములోని
ఈ నాగబంధము చూడండి-
దీనిలో రెండు విధాలైన బంధచిత్రాలను
కూర్చవచ్చు .

నాగబంధ పద్యం-

వరగుణరత్న విశ్రుతసువర్ణవతంస సబాలసత్వర
స్ఫురిత మరాళశ్రీగురవచోవశచిత్తదవిలాసవాసవా
వరజసమాంగవైరికరివారిదరానిలధీరమాంచితో
త్తరసశుభానురక్తతతతత్పరచాగయమంత్రిశేఖరా

చంపకమాలలో పాదానికి 21 అక్షరాల చొప్పున
4 పాదాలకు 84 అక్షరాలుంటాయి అయితే దీనిలో
20 అక్షరాలు రెండుమార్లు ఆవృత్తమౌతాయి -
అందు వల్ల 64 అక్షరాలే బంధంలో ఉంటాయి.



దీన్నే ద్వినాగ బంధంగా కూడ గీయవచ్చని
శ్రీమాన్ వైద్యం వేంకటేశ్వరాచార్యులుగారు గీచి
చూపించారు ఆ బంధచిత్రం ఇక్కడ చూడండి-




No comments: