పంచాక్షర బంధము
సాహితీమిత్రులారా!
5 గళ్ళలో అక్షరాలను నిబంధించడం వల్ల
దీనికి పంచాక్షర బంధము అంటారు.
శ్రీమాన్ వైద్యం వేంకటేశ్వరాచార్యుల
సంపాదకత్వంలో వెలువడిన
తిరుమల బుక్కపట్టణం అణ్ణయదేశిక విరచిత
చిత్రబంధ మాలికాలోని శ్లోకం-
విధీంద్ర వినుతం విశ్వభావిరాకా విధుచ్ఛవి
గౌరీ విభ్రమ విఖ్యాతం శాంకరీం వస్తు సంస్తుమః
బంధము -
తం శాం ద్ర క తం
మః ఖ్యా ధీం ను రీం
మ భ్ర వి శ్వ భా
స్తు గౌ ధు రా వ
రీ సం చ్ఛ స్తు కా
ఈ శ్లోకం వి - తో ప్రారంభమై ప్రతి మూడవ
అక్షరం వి- గా మూడవ పాదం వరకు ఉంది
శ్లోకాన్ని చదువుతూ బంధాన్ని గమనించండి
విషయం పూర్తిగా అర్థమౌతుంది.
No comments:
Post a Comment