Tuesday, July 11, 2017

మణిగణనికర గర్భ కందము


మణిగణనికర గర్భ కందము




సాహితీమిత్రులారా!


ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసంలోని
ఈ కందపద్యంలో  మణిగణనికరవృత్తము ఇమిడి ఉంది
చూడండి-

ధరణి ధర భరణ తతకర
సరసా శరవర విదళన చణనిశిత శరా
పురహర నుతనిజభుజబల
రి మాఖరకరనిభ గరుడగిరిపతీ

ఇందలి మణిగణనికరము-

ధరణి ధర భరణ తతకర సరసా 
శరవర విదళన చణనిశిత శరా
పురహర నుతనిజభుజబల రి మా
ఖరకరనిభ గరుడగిరిపతీ

1 comment:

Lokanadham Mamilla said...

కంద పద్యము నాలుగవ పాదములో రెండు అక్షరాలు లోపించినవి - విభ ( నిభ విభ ) అలాగే మణిగణ వృత్తములో కూడా ఆఖరి పాదములో - విభ లోపించింది . సరి చేయండి . గణ భంగము - మామిళ్ళ లోకనాథం