ఎవరు ఎప్పుడో తెలుసుకోవాలని!
సాహితీమిత్రులారా!
ప్రతి మానవుడు ఎప్పుడో ఒకప్పుడు టపాకట్టాల్సిందేకదా
ఆ ఆలోచనే కొంత మనమనసును కొంచె దూరంగా లాగేస్తుంది.
ఇక్కడ మన గ్రంథాల్లోని కొన్ని విషయాలను తెలుసుకుందాం-
ఈ సమాచారం కాశీఖండంలోనిది గమనించగలరు.
1. ఎడమ ముక్కురంధ్రం నుండి మాత్రమే లోనికి బయటికి
ప్రాణవాయువు సంచరించేవాడు మూడు సంవత్సరాల్లో
శరీరాన్ని వదిలేస్తాడు.
2. కుడిముక్కు రంధ్రంలోమాత్రమే ప్రాణవాయువు రెండు అహోరాత్రులుగాని/
మూడు అహోరాత్రాలు సంచరించేవాడు ఒక్క సంవత్సరంమాత్రమే జీవిస్తాడు.
3. ఎవని రెండు ముక్కుపుటాలనుంచి ఉచ్ఛ్వాసనిశ్శ్వాసలు 10 రోజులు సమంగా జరుగుతాయో ఆ ప్రాణి మూడుమాసాలు కాగానే మూట కట్టేస్తాడు.
4. ప్రాణవాయువు రెండు ముక్కురంధ్రాల నుంచీ సంచరించక క్షీణావస్థతో వస్తే, ఆ వ్యక్తి
మూడునాళ్ళు మాత్రమే బ్రతుకి ఉంటాడు.
5. ఆకాశం మీద పసుపు నలుపు వన్నెగల పురుషుణ్ణి చూచినవాడు
నాటినుండి రెండేళ్ళలో కన్నుమూస్తాడు.
6. తుమ్ము, ఇంద్రియం, మలమూత్రాలు సహజంగా విడవడానికి
శక్తి చాలక, హటాత్తుగా విడిచేవాడు సంవత్సరం పైన ఒక్కపూటగూడ ఉండడు.
ఇవి నిజమేనా ఎవరికెరుక అలాజరిగినవారు చెప్పాలికదా!
No comments:
Post a Comment