సర్వ లఘు సీసము
సాహితీమిత్రులారా!
నేమాని సన్యాసిరావుగారి
అధ్యత్మరామాయణంలోని
సర్వలఘు సీసము-
ఇందులో అన్ని గణాలలో లఘువులే వుండటం వల్ల దీనికి
సర్వలఘు సీసము అంటున్నాము. గమనించండి-
జలజ హిత కుల కలశ జలధి హిమ కిరణునకు,
దశరథుని తనయునకు, వశికి, హరికి,
జనక సుత హృదయమున దనరు ప్రియ వదనునకు
జన హృదయ నిలయునకు, సహృదయునకు,
దివిజ గణ వినుతునకు, దితిజ గణ శమనునకు
జగదవన నిరతునకు, జన హితునకు,
భవ భత్యములను దొలచి, పరమ సుఖములనొసగు
పరమ పురుషునకు, పురహర సఖునకు,
గీ: వనజ దళ నయనునకు, శుభ చరితునకు -
సవన ఫలదునకు, నిగమచయ నుతునకు,
దశ వదన ముఖ సుర రిపు తపనజునకు, -
కలిత భుజునకు, విభునకు కపి హితునకు,
No comments:
Post a Comment