Saturday, June 16, 2018

దీని భావమేమి తిరుమలేశ!


దీని భావమేమి తిరుమలేశ!




సాహితీమిత్రులారా!


ఈ పొడుపు పద్యం
విప్పండి-


వేయి కనులు కలిగి వెలయు నింద్రుడుకాడు
కాళ్లు నాల్గు కల్గు కాదు పశువు
నరుడు పట్టకున్న నడువగా జాదు
దీని భావమేమి తిరుమలేశ

వేయి కళ్లున్నాయి కాని ఇంద్రుడుకాదు
నాలుగు కాళ్లున్నాయి కాని పశువుకాదు
నడవాలంటే మనిషి పట్టాలంట
ఓ తిరుమలేశా దీని భావం చెప్పవయ్యా
అంటున్నాడు కవి.


సమాధానం - మంచం(నులక మంచం)

No comments: