Wednesday, June 13, 2018

చన్నులోన నుండు


చన్నులోన నుండు 




సాహితీమిత్రులారా!


ఈ పొడుపు పద్యం
విప్పండి-


చన్నులోన నుండు మన్నులో మరినుండు
కన్నులోన నుండు పన్నులోన
వెన్ను పొన్ను మిన్ను టన్నులో నుండును
చిన్ని కన్న విప్పి చెప్పు మన్న

చన్నులో, మన్నులో, కన్నులో, పన్నులో,
వెన్నులో, పొన్నులో, మిన్నులో, టన్నులో,
ఉంటుందట అదేమిటో చెప్పమంటున్నాడు
కవిగారు చెప్పండి మరి-



సమాధానం - న్ను - అనే అక్షరం

No comments: