ఒకరు పాలగకార్తు రొకరు రక్తము
సాహితీమిత్రులారా!
ఈ పొడుపు పద్యాన్ని
విప్పండి-
ఒకరు పాలగకార్తు రొకరు రక్తము కార్తు
రొకపక తల్లి పిల్లలక్కజముగ
తల్లియెవరు మరియు పిల్లలు నెవ్వరు
చిక్కువిప్పి చెప్పు చిన్ని కృష్ణ
ఒకరేమో పాలు కారుస్తారట
మరొకరేమో రక్తం కారుస్తారట
వాళ్లిద్దరు తల్లి పిల్లలు
వారిలో తల్లెవరు
పిల్లలెవరు - అని కవి అడుగుతున్నారు.
సమాధానం -
పాలుకార్చేది తల్లి - కలిమిచెట్టు
రక్తం కార్చేది పిల్లలు - కాయ, పండు
No comments:
Post a Comment