దీనిభావమేమి తెలుపరయ్య
సాహితీమిత్రులారా!
ఈ క్రింది పొడుపు పద్యం
విప్పండి -
కుతిక నలుపుగాని శితికంఠుడాగాడు
పామగగాదు తెమలిపక్షి గాదు
గంతులిడుచు నడచుఁగాని కప్పయుగాదు
దీనిభావమేమీ తెలుపరయ్య
మెడ నలుపుగా ఉంటుంది గాని
శివుడుకాదు
పాముగాదు
నెమలి గాదు
గంతులేస్తూ నడుస్తుంది కాని
కప్పా కాదు
మరి ఇదేమిటో చెప్పమంటున్నడు కవి.
సమాధానం ఊరచిచ్చుక
No comments:
Post a Comment