Tuesday, June 5, 2018

గాలి మేసి కక్కినంత నిప్పు కణికలగును


గాలి మేసి కక్కినంత నిప్పు కణికలగును




సాహితీమిత్రులారా!




ఈ పొడుపుకథను
విప్పండి-


గాలి మేసి మేసి గాలినే కక్కును
కక్కినంత నిప్పు కణికలగును
గాలి మేసి కక్కు గమనమ్ము మారదు
తేట తెల్లపరుచు తెలుగు బాల

గాలినే తింటుందట గాలినే కక్కుతుందట
కక్కితే నిప్పుకణికలవుతుందట
గాలిమేసి కక్కే గమనం మాత్రం మారదట
అదేమిటో చెప్పమంటున్నాడు కవి.


సమాధానం - కొలిమితిత్తి

No comments: