కరిభిద్గిరిభిత్తురంగ కమనీయంబై!
సాహితీమిత్రులారా!అష్టదిగ్గజాలలో ఒకరైన వారు ఈ పద్యాన్ని కృష్ణదేవరాయల మీద చెప్పారు. అది తెనాలి రామకృష్ణుడని కొందరు భట్టుమూర్తి అని కొందరు చెబుతున్నారు. ఎవరైనా ఆయన ఆస్థానంలోనివారేకదా! ఆ పద్యం
నరసింహ కృష్ణరాయని
కర మరుదగు కీర్తి యొప్పె, కరిభి ద్గిరిభిత్
కరికరిభిద్గిరి గరిభిత్
కరిభిద్గిరిభిత్తురంగ కమనీయంబై !
అర్థం :- కృష్ణరాయని - కరము - అరుదు - అగు = మిక్కిలి ఆశ్చర్యకరమైన, కీర్తి, కరిభిత్ = గజాసురుని సంహరించిన శివుని వలెను, గిరిభిత్ కరి = పర్వతముల రెక్కలను భేదించిన ఇంద్రుని యొక్క ఏనుగు ఐరావతము వలెను, కరిభిత్ - గిరి = ఈశ్వరుని కైలాస పర్వతము వలెను, గిరి - భిత్ = కొండలను భేదించిన - వజ్రాయుధము వలెను, కరిభిత్ - గిరిభిత్ - తురంగ = ఈశ్వరుని - ఇంద్రుని వాహనములైన నందీశ్వర, ఉచ్ఛైశ్శ్రవముల వలెను, తెల్లగా, ధగధ్ధాగాయమానమై, కమనీయంగా ఒప్పి కనిపించెను.
1 comment:
మీ బ్లాగు శోధిని లో కలపబడింది . వివరాలకు క్రింది లింక్ వీక్షించండి
http://www.sodhini.com/blogs/
Post a Comment