వ్యాపారి - బేరగాడు
సాహితీమిత్రులారా!
రాచనగరులో సంత జరిగేచోట కస్తూరి కుప్పగా పోసి కూర్చొని ఉన్నాడు వ్యాపారి.
అక్కడికి ఒక గొర్రెలకాపరి వచ్చాడు వారి మధ్య జరిగిన సంభాషణ ఈ పద్యంలో
కవి ఏవిధంగా వర్ణించాడో చూడండి. ఉత్పలమాల వృత్తంలో సంభాషణ.
గొర్రెలకాపరి - నల్లని దేంది బేరి? వ్యాపారి - మృగనాభిరా వల్లవ
గొ.- దీన్ని తింటారా? వ్యా. - ఫుల్లసరోజలోచనలు పూతురు చన్నుల
గొ.- బూసినితనే జల్లున చేపునా యెగసితన్నకవూరికె
పాలొసంగునా గుల్లకు యెంతయెత్తనుచు
గొంగడిపర్చిన నవ్విరందఱున్
No comments:
Post a Comment