దీని భావమేమి?
సాహితీమిత్రులారా!ఈ క్రింది పద్యం భావం తెలియ చెప్పండి అంటున్నాడు కవి.
కదళీ స్తంభమునందు నా యుతమై కంజాత మింపొందె, నం
దుదయంబై పవళించెఁ జంద్రుఁ, డచటన్ బ్రోత్ఫుల్లరక్తోత్పలం
బొదవెన్, తత్సుమజాతపై యమున స్వర్ణోర్వీధరంబందు దాఁ
బడి, నూఱై, గగనంబు గాంచె, నిది యేభావంబొ భావింపుఁడీ
(కదళీ స్తంభము =తొడ, నాళము = చేయి, కంజాతము = అఱచేయి, చంద్రుడు = ముఖము,
రక్తోత్పలము = ఎఱ్ఱబడిన కన్ను, యమున = కాటుకతో కూడిన కన్నీటిధార,
స్వర్ణోర్వీధరము = కుచము)
వియోగిని అయిన ఒక కోమలి, తొడపై చేతిని ఆనించుకొని, ముఖము అఱచేత చేర్చుకొని,
కన్నీరునించె అనియు, ఆ కన్నీరు, కుచకుండలములపైబడి, క్రిందికి జాలువారె అనియు,
-దీని భావము.
No comments:
Post a Comment